Abn logo
Apr 6 2021 @ 07:22AM

కత్తి పట్టుకున్న ఫొటో పోస్టుచేసిన వ్యక్తి అరెస్ట్

లాతూర్ (మహారాష్ట్ర): చేత్తో కత్తి పట్టుకొని ఫొటోకు ఫోజిచ్చిన ఓ యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టిన ఘటన మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో వెలుగుచూసింది. లాతూర్ నగరంలోని వైశాలీనగర్ ప్రాంతానికి చెందిన పెందూర్ ఉమేష్ అనే 27 ఏళ్ల యువకుడు కత్తి పట్టుకొని ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వివేకానంద చౌక్ పోలీసులు నిందితుడైన ఉమేష్ ను అరెస్టు చేశారు. ఆదివారం కూడా రవీంద్రకుమార్ అర్జునే అనే మరో వ్యక్తి కూడా కత్తి పట్టుకొని ఫొటో దిగి పెట్టాడని అరెస్ట్ చేశారు గతంలోనూ సంజయ్ నగర్ లో మరో ముగ్గురు వ్యక్తులు పదునైన కత్తులతో ఫొటోలు దిగడంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement