కళాశాల ఆన్‌లైన్ క్లాసులో అశ్లీల వీడియో ప్లే

ABN , First Publish Date - 2021-06-28T11:46:52+05:30 IST

కరోనా వైరస్ ప్రభావం వల్ల కళాశాల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది....

కళాశాల ఆన్‌లైన్ క్లాసులో అశ్లీల వీడియో ప్లే

ముంబై (మహారాష్ట్ర): కరోనా వైరస్ ప్రభావం వల్ల కళాశాల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ముంబైనగరంలోని విల్లాపార్లేలోని ఓ కళాశాల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతిలో ఒక్కసారిగా అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియో కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుడు షాక్ కు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియోను ప్రదర్శించారని కళాశాల ప్రొఫెసర్ జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జుహు పోలీసులు ఐపీసీ, ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ తరగతిలో అశ్లీల వీడియోను ప్రదర్శించిన వారెవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-06-28T11:46:52+05:30 IST