Abn logo
Oct 23 2021 @ 06:24AM

నేడు 14 పరీక్షా కేంద్రాల్లో పీఈసెట్‌

నల్లగొండ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేం ద్రాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి, ‘సెట్‌’ కన్వీనర్‌ వడ్డేపల్లి సత్యనారాయణ తెలిపారు. యూనివర్సిటీ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 5,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.