మలేరియా, డెంగ్యూ విజృంభిస్తున్నాయి: అయ్యన్న

ABN , First Publish Date - 2020-06-06T10:10:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైర్‌సకు సమాంతరంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల

మలేరియా, డెంగ్యూ విజృంభిస్తున్నాయి: అయ్యన్న

రాష్ట్రంలో కరోనా వైర్‌సకు సమాంతరంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో సీజనల్‌ వ్యాధుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న అవగాహన కూడా వైసీపీ ప్రభుత్వంలో లోపించిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొల్లు కబుర్లు చెప్పడం, అయినకాడికి అందినంత దోచుకొని తినడం తప్ప ప్రజారోగ్యం పట్టడం లేదని విమర్శించారు. ఏజెన్సీలో దోమ తెరలు ఇచ్చేశామని ఐఏఎస్‌ అధికారులు కూడా అబద్ధాలు చెబుతుంటే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేస్తూ... ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. వృద్ధిరేటు, అప్పుల వివరాలు, తలసరి ఆదాయాలను ప్రజలకు వెల్లడించాలి. తన అబద్ధాలతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్‌రెడ్డి చేసిన అప్పులను కప్పిపెట్టలేరు’’ అని పేర్కొన్నారు. మొత్తం వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్‌ చేశారు. అనుభవం తెలుగుదేశానిది అయితే, అబద్ధాలు వైసీపీవి అని ప్రజలకు ఇప్పటికే అర్థమైందని యనమల అన్నారు.

Updated Date - 2020-06-06T10:10:08+05:30 IST