చంద్రబాబు రాసిన అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి: ప్రకాశం జిల్లా ఎస్పీ

ABN , First Publish Date - 2021-09-09T04:23:42+05:30 IST

చంద్రబాబు రాసిన అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి: ప్రకాశం జిల్లా ఎస్పీ

చంద్రబాబు రాసిన అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి: ప్రకాశం జిల్లా ఎస్పీ

ఒంగోలు: లింగసముద్రం మండలం మొగిలిచర్ల ఘటనపై ఏపీ డీజీపీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ స్పందించి లేఖను విడుదల చేశారు. డీజీపీకి చంద్రబాబు రాసిన లేఖలో అంశాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని లేఖలో పేర్కొన్నారు. ‘‘పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు చంద్రబాబు కూడా సహరించాలని కోరుతున్నాం.  మొగిలిచర్ల గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి పోలీసు శాఖపై కొన్ని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. సరైన వాస్తవాలను తెలుసుకోకుండా పోలీస్ శాఖపై అలాంటి ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. ఇది గ్రామంలోని ఇరు రాజకీయ పార్టీలకు చెందిన వివాదం. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకూ కేసులు నమోదు చేశాం. కేసు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నది అవాస్తవం. ఇరువర్గాల కేసులపై లోతైన దర్యాప్తు చేపట్టాం. పోలీసుల బెదిరింపులకు ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న ఘటనపై కూడా కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరు చిన్నారులను విచారణకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామనటం కూడా అవాస్తవం. పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు మీరు కూడా సహరించాలని కోరుతున్నాం.’’ అని ఎస్పీ మలిక గర్గ్ లేఖలో తెలిపారు. 

Updated Date - 2021-09-09T04:23:42+05:30 IST