Abn logo
Feb 23 2021 @ 18:45PM

మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌కు చెందిన లెందుగురె భీమ్ రావు అనే వ్యక్తి కనపడటం లేదంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. అతని వయస్సు 56 ఏళ్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని బుర్రెపల్లె గ్రామానికి చెందిన భీమ్ రావుకు తెలుగు, మరాఠీ భాషలు తెలుసు. ఆయన ఎత్తు ఆరు అడుగులు. కనపడకుండా పోయిన రోజు తెలుపు, నలుపు గళ్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి  ఉన్నారు. తమకు సమాచారం అందించగలరని మల్కాజిగిరి పోలీసులు ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement
Advertisement