Advertisement
Advertisement
Abn logo
Advertisement

నకిలీ బంగారం కేసులో వ్యక్తి అరెస్ట్

విజయనగరం: నకిలీ బంగారం విక్రయించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిలో బంగారం రూ.20 లక్షలకే అని నమ్మించి డబ్బు కాజేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జియ్యమ్మవలస గ్రామానికి చెందిన అంబటి వెంకటనాయుడుకు హిమకర దాసు కిలో నకిలీ బంగారం అమ్మాడు. అయితే అది నకిలీ బంగారమని, అసలు బంగారం కాదనే నిజం తరువాత బయటపడింది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితుడు నుంచి రూ.17 లక్షలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement