అశ్లీల చిత్రాలు పంపిన వ్యక్తితో చాటింగ్.. ఇంటికి పిలిచిన యువతి!

ABN , First Publish Date - 2020-08-15T04:28:06+05:30 IST

తనకు అశ్లీల చిత్రాలు పంపి వేధిస్తున్న ఓ వ్యక్తితో చాటింగ్ చేసిందా యువతి. చక్కగా మాట్లాడి ఇంటికి రావాలని పిలిచింది.

అశ్లీల చిత్రాలు పంపిన వ్యక్తితో చాటింగ్.. ఇంటికి పిలిచిన యువతి!

చెన్నై: తనకు అశ్లీల చిత్రాలు పంపి వేధిస్తున్న ఓ వ్యక్తితో చాటింగ్ చేసిందా యువతి. చక్కగా మాట్లాడి ఇంటికి రావాలని పిలిచింది. ఎట్టకేలకు తన కోరిక తీరబోతోందని సంబరపడుతూ వచ్చిన సదరు వ్యక్తిని కుటుంబ సభ్యులతో కలిసి చావబాదింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. స్థానికంగా నివశించే ఓ యువతికి అశ్లీల చిత్రాలు పంపుతూ వేధించాడో 29ఏళ్ల యువకుడు. తన హెచ్చరికలు పెడచెవిన పెట్టడంతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చింది. అతని బెదరింపులకు లొంగినట్లు నటించి ఇంటికి పిలిపించింది. అతను రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆమె కుటుంబసభ్యులు అతన్ని చితకబాదారు. ఆపై పోలీసులకు పట్టించారు. నిందితుడు ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-08-15T04:28:06+05:30 IST