షాకింగ్: ప్రయాణిస్తున్న విమానంలోంచి దూకిన ప్రయాణికుడు

ABN , First Publish Date - 2021-06-27T23:28:36+05:30 IST

విమానంలో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి, అది సాధ్యం కాకపోవడంతో ఎమర్జెన్సీ డోరు నుంచి బయటకు దూకేసిన ఘటన అమెరికాలో చో

షాకింగ్: ప్రయాణిస్తున్న విమానంలోంచి దూకిన ప్రయాణికుడు

వాషింగ్టన్: విమానంలో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి, అది సాధ్యం కాకపోవడంతో ఎమర్జెన్సీ డోరు నుంచి బయటకు దూకేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అమెరికాకు చెందిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ నుంచి సాల్ట్ లేక్ సిటీకి బయల్దేరింది. ఫ్లైట్ టేకాఫ్ కోసం రన్‌వేపై పరుగులు తీస్తుండగా.. అందులోని ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. అకస్మాత్తుగా తన సీటులోంచి లేచి.. కాక్‌పిట్ వైపు పరుగులు తీశాడు. అనంతరం కాక్‌పిట్‌ తలుపులు తెరిచి, అందులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎమర్జెన్సీ డోరు తెరిచి విమానం నుంచి బయటకు దూకేశాడు. 



ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడిని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత విమానం సాల్ట్ లేక్ సిటీకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు ప్రయాణికుడు అలా ఎందుకు ప్రవర్తించాడనే కోణంలో విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.  ఇటీవల అమెరికాలో ఇలాంటి విమాన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 3,000 సంఘటనలు నమోదయ్యాయి.


Updated Date - 2021-06-27T23:28:36+05:30 IST