కరోనా లేదంటూ.. ఏటీయంలో బటన్స్ అన్నీ నాలుకతో నాకి..

ABN , First Publish Date - 2021-01-27T11:36:44+05:30 IST

ప్రపంచంలో కరోనా మహమ్మారి బారిన పడి వణికిపోతున్న దేశాల్లో యూరప్ దేశం బ్రిటన్ ఒకటి. ఇక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యమే చేస్తోంది. తాజాగా ఈ దేశంలో కరోనా మరణాలు లక్ష మార్కు దాటాయి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి

కరోనా లేదంటూ.. ఏటీయంలో బటన్స్ అన్నీ నాలుకతో నాకి..

లండన్: ప్రపంచంలో కరోనా మహమ్మారి బారిన పడి వణికిపోతున్న దేశాల్లో యూరప్ దేశం బ్రిటన్ ఒకటి. ఇక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యమే చేస్తోంది. తాజాగా ఈ దేశంలో కరోనా మరణాలు లక్ష మార్కు దాటాయి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదం అయింది. కరోనా అనేదే అసలు లేదని, ఇదంతా దొంగ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని ఆరోపించాడో వ్యక్తి. తన మాటలపై నమ్మకం కుదిరేలా చేసేందుకు ఓ ఏటీయంలోకి వెళ్లి అక్కడి మెషీన్ బటన్స్ అన్నీ నాలుకతో నాకుతూ వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘కరోనానా ఇంకేమన్నానా? ఇదంతా వట్టి అబద్ధం. దొంగ ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేస్తా చూడండి’’ అంటూ పోస్టు పెట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం సౌత్ యార్క్‌షైర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-27T11:36:44+05:30 IST