ఆపిల్‌ను బ్రేక్‌ చేశాడు...

ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST

ఆపిల్‌ సంస్థ నుంచి వచ్చే ఐ పోన్లకు ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్‌. అందులో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు కూడా చాలా స్ట్రాంగ్‌. అలాంటిది వాటిని ఛేదించి... ఏకంగా ఆపిల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అయ్యి చరిత్ర సృష్టించాడు ఇండియన్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ భావూక్‌ జైన్...

ఆపిల్‌ను బ్రేక్‌ చేశాడు...

ఆపిల్‌ సంస్థ నుంచి వచ్చే ఐ పోన్లకు ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్‌. అందులో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు కూడా చాలా స్ట్రాంగ్‌. అలాంటిది వాటిని ఛేదించి... ఏకంగా ఆపిల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అయ్యి చరిత్ర సృష్టించాడు ఇండియన్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ భావూక్‌ జైన్‌. ప్రతిగా ఆపిల్‌ సంస్థ నుంచి 75 లక్షల రూపాయల బహుమతిని పొందాడు. 


జైన్‌ వయసు 27 ఏళ్లు. ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేశాడు. ప్రస్తుతం అతను ఫుల్‌టైమ్‌ ‘బగ్‌ బౌంటీ హంటర్‌’గా పనిచేస్తున్నాడు. ఆపిల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వడం హ్యాకర్లందరికీ పెద్ద సవాల్‌. దాన్ని ఛేదించడాన్ని చాలా గొప్పతనంగా భావిస్తారు. చిన్న వయసులోనే జైన్‌ ఈ ఘనత సాధించాడు. 

ఆపిల్‌లో వాడే థర్డ్‌పార్టీ యాప్‌లు ద్వారా ఆపిల్‌ యూజర్స్‌ అకౌంట్‌ను జైన్‌ బ్రేక్‌ చేశాడు. థర్డ్‌ పార్టీ యాప్‌లను హ్యాక్‌ చేసి ఆపిల్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యాడు. తద్వారా ఆపిల్‌ ఐడీ ఉన్నా లేకున్నా ఆ యూజర్‌ వాడే మొత్తం అకౌంట్లను తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. దీనికోసం ‘జీరో డే బగ్‌’ అనే సాప్ట్‌వేర్‌ను జైన్‌ ఉపయోగించాడు. ‘‘సెక్యూరిటీ ఫీచర్స్‌ లోపాలను గుర్తించి హెచ్చరించడం ద్వారా ఇంటర్నెట్‌ను ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రదేశంగా చేయడమే నా లక్ష్యం’’ అని జైన్‌ చెప్పాడు. తమ సెక్యూరిటీ ఫీచర్స్‌లో లోపాలను గుర్తించినందుకు ఆపిల్‌ సంస్థ ‘ఆపిల్‌ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్‌’ కింద జైన్‌కు లక్ష డాలర్లను అందించింది. 


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST