Abn logo
Jun 3 2021 @ 17:17PM

పెద్దపల్లి బీజేపీ నేతల్లో ముసలం

మంచిర్యాల జిల్లా: పెద్దపల్లి నియోజకవర్గం బీజేపీలో ముసలం పుట్టింది. టీబీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌పై అసంతృప్తి నేతల తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడా జనార్థన్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. వివేక్ తీరు నచ్చక గతంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షపదవికి సోమారపు రాజీనామా చేశారు.


గురువారం జరిగిన సమావేశానికి 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అసంతృప్తి నేతలను ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఈటల ఎపీసోడ్‌తో వివేక్ బిజీగా ఉన్నారు.