టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం ఎంఎ్‌సపీ

ABN , First Publish Date - 2021-01-20T05:17:04+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం ఎంఎ్‌సపీ

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం ఎంఎ్‌సపీ
సదస్సులో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

భీమారం, జనవరి 19 : టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం మహాజన సోషలిస్టు పార్టీయేనని మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎ్‌సపీ) జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం హన్మకొండ భీమారంలోని తులసీ గార్డెన్‌లో నిర్వహించిన ఎంఎ్‌సపీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు.  తెలంగాణలో కొనసాగుతున్న దొరలరాజ్యం స్థానంలో పేదల రాజ్యాన్ని స్థాపిస్తామన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఎంఎ్‌సపీ నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారని, ఇప్పుడు సర్జికల్‌ స్ట్రైక్‌ ఏమైందని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ తక్కువ శాతం జనాభా ఉన్న రెడ్డి, వెలమలకు ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎంఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీ్‌పగౌడ్‌, కో ఆర్డినేటర్‌ రజియ హైదర్‌, సభాధ్యక్షుడు రాజమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట రవి, వికలాంగుల పోరాట కమిటీ అధ్యక్షుడు రాంబాబు, ఎంఎ్‌సపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు లత, తెలంగాణ శ్రీను, మంద కుమార్‌, పుట్ట భిక్షపతి, వేల్పుల సూరన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T05:17:04+05:30 IST