సమావేశం ముగిసే వరకూ అధికారులుండరా..?

ABN , First Publish Date - 2021-09-18T04:26:46+05:30 IST

సమావేశం ముగి య కుండానే కొందరు అధికారులు బైటకు వెళ్లిపోవ డమేం టని సర్పంచ్‌లు తెల్లం వరలక్ష్మి, కృష్ణవేణి, ఎంపీటీసీ కొర్సా చిలకమ్మ గట్టిగా ప్రశ్నించారు.

సమావేశం ముగిసే వరకూ అధికారులుండరా..?
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

దుమ్ముగూడెం సెప్టెంబరు 17: సమావేశం ముగి య కుండానే కొందరు అధికారులు బైటకు వెళ్లిపోవ డమేం టని సర్పంచ్‌లు తెల్లం వరలక్ష్మి, కృష్ణవేణి, ఎంపీటీసీ కొర్సా చిలకమ్మ గట్టిగా ప్రశ్నించారు. ఇకపై అలా జరగ కుండా చూస్తానని ఎంపీడీఓ చంద్రమౌళి సమాధా నమివ్వడంతో శాంతించారు. శుక్రవారం జరిగిన మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. మిషన్‌ భగీరధ ద్వారా కలుషిత మైన తాగునీటి సరఫరా జరుగుతోందనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు. తాగునీరు వాడకం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్ర మాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మండ లంలో వందశాతం వాక్సినేషన్‌ పూర్తవ్వాలని, వ్యాక్సిన్‌ వే యించుకోని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించవని తెలి పారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరా రు. కరోనా నివారణకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు ధరించడంతోపాటు.. భౌతిక దూరం పాటించాలని కోరారు. స్థానిక క్లినికల్‌ ల్యా బుల నుంచి వైద్యపరీక్షలపై తప్పుడు నివేదికలు వస్తున్నా యని, వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ టీసీ వంశీ వైద్యాధికారి బాలాజీనాయక్‌ను ప్రశ్నిం చారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. విద్యుత్‌కు సంబంధించిన పలు సమస్యలపై ఏఈ రోహిణిను పలువురు ప్రజాప్రతినిధులు నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండునెలలకు బదులుగా ఇకపై ప్రతీనెలా విద్యుత్‌ బిల్లు చెల్లించాలని ఏఈ తెలి పారు. మండల వ్యాప్తంగా మిషన్‌ భగీరధ తాగునీటి సర ఫరా విషయంలో సంబంధిత అధికారులు ఏళ్లతరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవా లని పలువురు డిమాండ్‌ చేశారు. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మీ, ఎంపీడీఓ చంద్రమౌళి, ఏఈలు శ్రీరాం, రాజ్‌ సుహాస్‌, ఎంఈఓ సమ్మయ్య, సీడీపీఓ నవ్యశ్రీ, సర్పంచిలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-18T04:26:46+05:30 IST