Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో ఫిర్ని

కావలసినవి: బియ్యం - 150గ్రా, పంచదార - 200గ్రా, పాలు - 500ఎంఎల్‌, యాలకులు - 10గ్రా, మామిడిపండు గుజ్జు - 100గ్రా, బాదంపలుకులు - 25గ్రా.


తయారీ విధానం: ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి కొద్దిగా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి పాలు పోసి, యాలకుల పొడి వేసి మరిగించాలి. ఇప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి. చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. స్టవ్‌పై నుంచి దింపి చల్లారిన తరువాత మామిడిపండు గుజ్జు వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఫ్రిజ్‌లో అరగంటపాటు పెట్టాలి. బాదంపలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి. ఈ కూల్‌ మ్యాంగో ఫిర్ని టేస్ట్‌ చేస్తే మీ జిహ్వచాపల్యం తీరుతుంది.

సి. రామకృష్ణారెడ్డి

సూ చెఫ్‌

గోల్కొండ రిసార్ట్స్‌ అండ్‌ స్పా, హైదరాబాద్‌

ఫోన్‌: 9110726536

చిత్రాన్నంచైనీస్‌ పాన్‌కేక్స్‌ఇడ్లీ ఫ్రైసాంబార్‌ పొడిమ్యాంగో ఐస్‌ టీహరా భరా కబాబ్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీ
Advertisement