Abn logo

మ్యాంగో ఐస్‌క్రీమ్

కావలసినవి: పాలు - ఒకకప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, మామిడిపండు ముక్కలు - ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - ఒక కప్పు.


తయారీ: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకొని, అందులో కస్టర్డ్‌ వేసి కలుపుకొని పక్కన  పెట్టుకోవాలి. మిగిలిన పాలను మరొక పాత్రలో తీసుకొని పంచదార వేసి వేడి చేయాలి. పంచదార కరిగి, పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ మిశ్రమం వేసి కలుపుకోవాలి. కాసేపు మరిగిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా వేసి కలుపుకోవాలి. మూత గట్టిగా ఉండే పాత్రలోకి మిశ్రమాన్ని మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపయ్యాక ఫ్రిజ్‌లో నుంచి తీసి బాగా కలియబెట్టి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి మ్యాంగో ఐస్‌క్రీమ్‌ సర్వ్‌ చేయాలి.

మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంబనానా ఐస్‌క్రీం
Advertisement