Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో ఐస్‌ టీ

కావలసిన పదార్థాలు: టీ బ్యాగులు- రెండు, మామిడి పండు- ఒకటి, నీళ్లు- అర లీటరు తేనె లేదా చక్కెర - మీ ఇష్టాన్ని బట్టి, నిమ్మకాయ - ముక్కలుగా కోసింది ఒకటి, పుదీనా ఆకులు- పది, ఐస్‌ క్యూబ్‌లు- తగినన్ని.


తయారు చేసే విధానం: ముందుగా నీటిని ఓ పాత్రలో పోసి మరిగించాలి. ఇందులో టీ బ్యాగులు కూడా వేసి మరి కాసేపు మరిగించాలి. బాగా మరిగాక బ్యాగులు తీసేయాలి. తేనీరు చల్లబడ్డాక ఫ్రిజ్‌లో పెట్టాలి. మామిడి పండు తొక్కతీసి ముక్కలు కోసి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి చల్లని టీ కలిపి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. సర్వ్‌ చేసేప్పుడు ఓ పొడవాటి గ్లాస్‌లో మ్యాంగో టీని పోసి చక్కెర లేదా తేనెను కలుపుకోవాలి. పైన ఐస్‌ క్యూబ్‌లు, పుదీనా ఆకులు వేసుకుని తాగొచ్చు.

చిత్రాన్నంచైనీస్‌ పాన్‌కేక్స్‌ఇడ్లీ ఫ్రైమ్యాంగో ఫిర్నిసాంబార్‌ పొడిహరా భరా కబాబ్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సాండ్‌విచ్‌తాజా నెయ్యి ఇంట్లోనే...సొరకాయ కూటు పచ్చి మామిడి జెల్లీ
Advertisement