Abn logo

మ్యాంగో పనీర్‌ రోల్స్‌

కావలసినవి: మామిడిపండు - ఒకటి, పనీర్‌ - అర కప్పు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌ - గార్నిష్‌ కోసం.


తయారీ: ముందుగా ఒక పాత్రలో పనీర్‌ను పొడిగా చేయాలి. తరువాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మామిడిపండు తొక్క తీసి కొద్దిగా సన్నని, వెడల్పాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  ఒక ప్లేట్‌లో ఆ ముక్కలు పెట్టి, ప్రతీ ముక్కపై కొద్దిగా పనీర్‌ మిశ్రమాన్ని పెట్టుకుంటూ రోల్‌ చేసుకోవాలి. చివరగా సిల్వర్‌ ఫాయిల్‌, రోజ్‌ పెటల్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అయ్యాక సర్వ్‌ చేసుకోవాలి.

కొబ్బరి లడ్డూకజ్జికాయలుచిక్కీలుబర్ఫీదివాళీ పల్లీ పట్టిదివాళీ రవ్వలడ్డుషోర్‌ భాజామావా కోకొనట్‌ రోల్‌కడాకనీసగ్గుబియ్యం పాయసం (వీడియో)
Advertisement
Advertisement