ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-01T02:09:41+05:30 IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో శుక్రవారం మావోయిస్టులకు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన

ఏవోబీలో మావోల డంప్‌ స్వాధీనం

సీలేరు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో శుక్రవారం మావోయిస్టులకు చెందిన డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మల్కన్‌గిరి జిల్లా సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి అభిషేక్‌ శుక్రవారం విలేఖరులకు అందజేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తాబేరు-అర్లింగ్‌పాడ గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌, మల్కన్‌గిరి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులకు చెందిన డంప్‌ లభ్యమైంది. ఈ డంప్‌లో ఆరు క్యారేజ్‌ ఎల్‌ఈడీలు, రెండు ప్రెజర్‌ ఎన్‌ఈడీలు, ఒక మీటర్‌ కొడాక్స్‌ వైర్‌, ఒక ఇన్‌సాస్‌ మ్యాగ్జన్‌, ఒక ఐఈడీ మెకానిజమ్‌, మావోయిస్టు యూనిఫామ్‌ ఒక జత, 9 వాట్స్‌ బ్యాటరీ ఒకటి, 3 వాట్స్‌ బ్యాటరీలు మూడు, విప్లవ సాహిత్యం, మందులు లభ్యమయ్యాయి. ఇటువంటి డంప్‌లు ఈ ప్రాంతంలో ఇంకా వున్నట్టు తమకు సమాచారం ఉందని, వాటి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-01-01T02:09:41+05:30 IST