వంద శాతానికి మించి కష్టపడతాడు

ABN , First Publish Date - 2020-11-22T09:23:42+05:30 IST

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగినా వంద శాతానికి మించే కష్టపడతాడని ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌

వంద శాతానికి మించి కష్టపడతాడు

విరాట్‌పై స్టొయినిస్‌


సిడ్నీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగినా వంద శాతానికి మించే కష్టపడతాడని ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ ప్రశంసించాడు. అతడిని ఎదుర్కొనేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయన్నాడు. ‘ఈసారి ఆసీస్‌ టూర్‌లో కోహ్లీ తక్కువ మ్యాచ్‌లు ఆడనున్నాడు. అయినా అతడి ఆట గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదు. ఎందుకంటే అతడు 110 శాతం కష్టపడతాడు. ఇలాంటి సమయంలో కోహ్లీకి అదనంగా ప్రేరణ అవసరం లేదు. విరాట్‌ను కట్టడి చేసే విషయంలో గతంలో కొన్ని ప్రణాళికలు పనిచేయలేదు. అవి ఈసారి పూర్తిస్థాయిలో అమలవ్వాలని కోరుకుంటున్నాం’ అని స్టొయినిస్‌ చెప్పాడు.

Updated Date - 2020-11-22T09:23:42+05:30 IST