మార్కెట్... ‘బౌనన్స్ బ్యాక్’...

ABN , First Publish Date - 2021-06-19T02:31:08+05:30 IST

వారాంతంలో... సెన్సెక్స్ 722 పాయింట్లు పతనమైనా, చివరకు 21 పాయింట్లు లాభంతో ముగిసింది.

మార్కెట్... ‘బౌనన్స్ బ్యాక్’...

ముంబై :  వారాంతంలో... సెన్సెక్స్ 722 పాయింట్లు పతనమైనా, చివరకు 21 పాయింట్లు లాభంతో ముగిసింది. ఇక... నిఫ్టీ... 15451 పాయింట్లకి పడిపోయి, మళ్ళీ 15683 పాయింట్లకు ఎగిసింది. సెన్సెక్స్ 52334 పాయింట్ల వద్ద , నిఫ్టీ 15683 పాయింట్ల వద్ద ట్రేడ్ ముగించుకున్నాయి.మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 0.70,0.89 శాతం నష్టపోయాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బేర్స్‌కు అనుకూలంగా మలుపు తిరిగి 1:2 గా  నమోదైంది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ రెండు శాతం నష్టపోగా, ఆటో, మెటల్, రియాల్టీ సెక్టార్లు కూడా ఒక్కోశాతం చొప్పున  నష్టపోయాయి. అయితే... ఉదయం నష్టాల్లో ఉన్న ఎఫ్ఎంసీజీ... ముగింపులో మాత్రం 0.29 శాతం లాభపడటం గమనార్హం. 


ఇక... సూచీలు ఇంతగా బౌన్స్ బ్యాక్ అవడానికి భారతి ఎయిర్‌టెల్, హెచ్ల్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ దోహదం చేశాయి. ఇక గెయినర్ల విషయానికొస్తే... ఉదయం చెప్పుకున్నట్లుగా అదానీ పోర్ట్స్ కు ‘కొనుగోళ్ళ మద్దతు’ లభించడంతో 7.33 శాతం లాభపడింది. తర్వాత బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, భారతి ఎయిర్ టెల్, గ్రాసిం 2.79-1.55 శాతం లాభపడ్డాయ.  లూజర్లలో ఓఎన్‌జీసీ, కోల్ ఇఁడియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, యూపీఎల్ 3.88-3.24 శాతం మేర నష్టపోయాయి. 

Updated Date - 2021-06-19T02:31:08+05:30 IST