పికప్ అందుకున్న ‘మారుతి’...

ABN , First Publish Date - 2022-01-27T20:45:19+05:30 IST

కొంత కాలంగా డల్‌గా ఉన్న మారుతి సుజుకి... మళ్ళీ పికప్ అందుకుంది.

పికప్ అందుకున్న ‘మారుతి’...

న్యూఢిల్లీ : కొంత కాలంగా డల్‌గా ఉన్న మారుతి సుజుకి... మళ్ళీ పికప్ అందుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, మెరుగైన ఆదాయాలను కంపెనీ ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలకు సంబంధించి సానుకూలత, తగ్గిన ముడిసరుకు ధరల ప్రాతిపదికన... బ్రోకరేజీలు తమ అంచనాలను, వాల్యూమ్ ఔట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేశాయి. ప్యాసింజర్ వెహికల్(పీవీ) మార్కెట్‌లో సెమీకండక్టర్ల లభ్యత, డిమాండ్‌లో వృద్ధి కూడా అప్‌గ్రేడ్‌కు దోహదపడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధికి అణుగుణంగా, మారుతి పీవీ మార్కెట్ 7-8 శాతం వృద్ధి చెందుతుందని మారుతి అంచనా వేసింది.


స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను జెఫరీస్ గతంలోని రూ. 9,250 నుంచి రూ. 10,500కి కు అప్‌గ్రేడ్ చేసింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్ల విడుదల నేపథ్యంలో, రాబోయే రెండేళ్లలో పెద్ద రెండంకెల అమ్మకాల వృద్ధిని కంపెనీ సాధిస్తుందని అంచనా వేస్తోంది. కాగా... 2022-24 కాలంలో ఈపీఎస్ మూడు రెట్లు పెరిగి రూ. 409 కు చేరుతుందని చెబుతోంది. ఇది, ఏకాభిప్రాయం కంటే 19-30 శాతం ఎక్కువ. కార్ల ధరలను కంపెనీ పెంచినందున, పెరుగుతున్న వ్యయ ఒత్తిళ్లు భర్తీ అవుతాయని, ఈ క్రమంలో... ఎబిటా మార్జిన్లు పెరుగుతాయని కూడా బ్రోకరేజ్‌ అంచనా వేస్తోంది.


మరో రెండు నెలల్లో(మార్చితో) ముగిసే పూర్తి ఆర్ధిక సంవత్సరానికి, మారుతి మార్జిన్లు... ఏడు శాతానికి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా... రాబోయే సంవత్సరాల్లో 12-12.3 శాతం అప్‌ట్రెండ్‌లో కంపెనీ కొనసాగే అవకాశముందని లెక్కగట్టింది. ఇక... మూడు త్రైమాసైికం ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను మారుతి అధిగమించింది. రూ. 1,011 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది, ఇది... వార్షిక ప్రాతిపదికన చూస్తే 48 శాతం క్షీణత. కార్ల అమ్మకాల ద్వారా.... గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 22,236 కోట్ల నుంచి తగ్గి, ఈ త్రైమాసికంలో రూ. 22,187 కోట్ల ఆదాయం పొందింది. 


చిప్‌ కొరత కారణంగా మారుతికి 2.64 వక్షల యూనిట్ల ఆర్డర్ బ్యాక్‌లాగ్ ఉంది. రెండో త్రైమాసికంలోని 3.85 లక్షల యూనిట్లతో పోలిస్తే... మూడో త్రైమాసికంలో ఇది 40,300 యూనిట్లను రిటైల్ చేసింది. ఇదిలా ఉంటే... సెమీకండక్టర్ల స రఫరా క్రమంగా మెరుగుపడుతున్నందున... నాలుగో త్రైమాసికంలో ఉత్పత్తి మరింత పెరగనున్నట్లు భావిస్తున్నారు. చిప్ కొరత కారణంగా... మూడో త్రైమాసికంలో 90 వేల వాల్యూమ్స్‌ను మారుతి కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, స్టీల్‌ వంటి ముడి పదార్థాల ధరల ఒత్తిడి తగ్గడం మొదలైనందున... నాలుగో త్రైమాసికంలో ఈ వ్యయాలు మరింత తగ్గుతాయని మారుతి భావిస్తోంది. సానుకూల దృక్పథం కారణంగా ఇతర బ్రోకరేజీలు కూడా కంపెనీపై లక్ష్యాలను పెంచాయి. 


రిలయన్స్ సెక్యూరిటీస్... ప్రైస్‌ టార్గెట్‌ను మునుపటి రూ. 8,751 నుంచి రూ. 9,700 కు పెంచింది. ఇక... 2024 ఆర్ధిక సంవత్సరం ఆదాయాలపై 27 రెట్ల రివైజ్డ్ పీఈని అంచనా వేసింది. ఎంకే గ్లోబల్‌ కూడా రూ. 8,751 నుంచి రూ. 9,850 కు లక్ష్యాన్ని  పెంచింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో బలమైన పట్టు, సానుకూల ప్రొడక్ట్‌ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, కోవిడ్ తర్వాత పెరిగే డిమాండ్‌లో మారుతి అతి పెద్ద లబ్ధిదారుగా మారుతుందని మోతీలాల్ ఓస్వాల్‌ చెబుతోంది. ఈ క్రమంలోనే... 2022, 223 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి... ఈపీఎస్ అంచనాలను వరుసగా 21 శాతం, 6 శాతం పెంచింది. ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం 12.57 గంటల సమయానికి... దాదాపు అర శాతం పడిన షేర్లు, రూ. 8,568.60 వద్ద ఉన్నాయి.

Updated Date - 2022-01-27T20:45:19+05:30 IST