హైదరాబాద్‌లో మారుతి సబ్‌స్ర్కిప్షన్‌ సేవలు

ABN , First Publish Date - 2020-10-21T09:09:28+05:30 IST

హైదరాబాద్‌, పుణె నగరాల్లో వ్యక్తిగత వినియోగదారుల కోసం వాహన సబ్‌స్ర్కిప్షన్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్‌లో  మారుతి సబ్‌స్ర్కిప్షన్‌ సేవలు

మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ).. హైదరాబాద్‌, పుణె నగరాల్లో వ్యక్తిగత వినియోగదారుల కోసం వాహన సబ్‌స్ర్కిప్షన్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ సేవల కోసం ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసె్‌సతో ఎంఎ్‌సఐ జట్టు కట్టింది. మారుతి ఎరీనా డీలర్‌షి్‌పల్లో స్విఫ్ట్‌, డిజైర్‌, విటారా బ్రెజ్జా, ఎర్టిగా వాహనాలను నెక్సా అవుట్‌లెట్స్‌ నుంచి బాలెనో, సియాజ్‌, ఎక్స్‌ఎల్‌6 కార్లను వినియోగదారులు సబ్‌స్ర్కిప్షన్‌ చేసుకోవచ్చని పేర్కొంది. సబ్‌స్ర్కిప్షన్‌ కాలపరిమితి 24,36,48 నెలలుగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్‌లో స్విఫ్ట్‌ ఎల్‌ఎక్స్‌ కోసం సబ్‌స్ర్కిప్షన్‌ చార్జీలు నెలకు రూ.15,479 (పన్నులు కలుపుకుని) నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.  

Updated Date - 2020-10-21T09:09:28+05:30 IST