Abn logo
Sep 8 2021 @ 19:29PM

పడిపోయిన Maruti Suzuki ఉత్పత్తి

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మరో ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో తమ ఉత్పత్తి పడిపోయిందని సంస్థ పేర్కొంది. చిప్ కొరత కారణంగా ఆగస్టు 2021లో మారుతి సుజుకి ఉత్పత్తి దాదాపు 8 శాతం పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 2021లో 113,937 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 123,769 యూనిట్లతో పోలిస్తే ఇది సంవత్సరానికి 7.9 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది.