Advertisement
Advertisement
Abn logo
Advertisement

మష్రూమ్‌ ఫ్రై

కావలసిన పదార్థాలు: బటన్‌ మష్రూమ్‌లు- 250 గ్రాములు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, పచ్చి మిర్చి- 3, పసుపు, మిరియాల పొడి- పావు స్పూను, గరం మసాలా - కాస్త, నూనె, ఉప్పు- తగినంత, కొత్తిమీర ఆకులు- స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా మష్రూమ్‌లను కట్‌చేసుకుని పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలని దోరగా వేయించాలి. పచ్చి మిర్చీ వేసి అర నిమిషం వేయించాక పుట్టగొడుగుల్ని జతచేయాలి. తర్వాత ఉప్పు, గరం మసాల కలిపి వేయించాలి. పుట్టగొడుగులు బంగారు రంగులోకి మారేవరకు వేయిస్తే మష్రూమ్‌ ఫ్రై రెడీ. పైన అలంకరణగా కొత్తిమీర చల్లాలి.

పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని