మయాంక్‌.. 30 ఏళ్ల రికార్డు

ABN , First Publish Date - 2020-02-22T10:29:34+05:30 IST

బంతి శరీరంపైకి, వికెట్ల మీదకు రివ్వున దూసుకొచ్చే న్యూజిలాండ్‌ పిచ్‌లపై ఓపెనర్లు తొలి సెషన్‌ అంతా బ్యాటింగ్‌ చేయడం...

మయాంక్‌.. 30 ఏళ్ల రికార్డు

బంతి శరీరంపైకి, వికెట్ల మీదకు రివ్వున దూసుకొచ్చే న్యూజిలాండ్‌ పిచ్‌లపై ఓపెనర్లు తొలి సెషన్‌ అంతా బ్యాటింగ్‌ చేయడం మామూలు విషయం కాదు. కానీ మయాంక్‌ అగర్వాల్‌ అలా నిలిచి అరుదైన రికార్డు అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో మొదటి సెషన్‌ అంతా అగర్వాల్‌ బ్యాటింగ్‌ చేశాడు. ఎప్పుడో.. 1990లో నేపియర్‌లో కివీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఓపెనర్‌గా వచ్చిన మనోజ్‌ ప్రభాకర్‌ కూడా తొలి సెషన్‌ అంతా క్రీజ్‌లో నిలిచాడు. మళ్లీ 30 ఏళ్ల తర్వాత మయాంక్‌ ఆ ఘనత అందుకున్నాడు.

Updated Date - 2020-02-22T10:29:34+05:30 IST