హరితహారం విజయవంతానికి ముందస్తు ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-06-12T05:39:36+05:30 IST

హరితహారం విజయవంతానికి ముందస్తు ప్రణాళికలు

హరితహారం విజయవంతానికి ముందస్తు ప్రణాళికలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ 

మహబూబాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : హరితహారం విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం ముందస్తు ప్రణాళికకు చేపట్టాల్సిన అంశాలపై సంబంధితాధికారులతో చర్చిం చారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి గాను 69 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 80లక్షల మొక్కలు ఉన్నట్లు తెలిపారు. అలాగే అద నంగా మునిసిపాలిటీల్లో కూడా నర్సరీలో ఉన్నాయని, వాటిలో కూడా మొక్కలు పెంపకం జరుగుతుందన్నారు. నర్సరీల్లో మొక్కలకు ఏర్పాటు చేసిన షేడ్‌నెట్‌ల ను వెంటనే తొలగించాలన్నారు, మొక్కల్లో పెద్దవి వేరు చేయాలని, చిన్న మొక్క ల ఎదుగుదలకు జీవామృతం వంటి ఎరువులను వినియోగించి పెరిగేందుకు కృషి చేయాలన్నారు. 

వర్షాలు కురుస్తున్న తరుణంలో ముందస్తుగా గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. శాఖల వారీగా కేటయించిన మొక్కల లక్ష్యాలను అధికారులకు వివరించి వాటిని సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిం చుకోవాలన్నారు. నాటిన మొక్కలట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్లు భవనాల శాఖ 31కిలో మీటర్ల మేర, పంచాయతీరాజ్‌ శాఖ 150 కిలో మీటర్ల పరిధిలో గుంతలు తవ్వించి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచుకోవాల న్నా రు. నీటి పారుదల శాఖ ఎస్సారెస్పీ కాల్వల వెంట మొక్కలు నాటేందుకు సిద్ధం చేసుకోవాలన్నారు. 20 లక్షలు అవెన్యూ ప్లాంటేషన్‌, 30 లక్షలు ఇళ్లలో నాటే మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకోవాలన్నారు. అలాగే టేకు మొక్కల పెంప కం చేపట్టే రైతులను గుర్తించి నివేదిక రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, జిల్లా అధికారులు రవికిరణ్‌, వీవీఅప్పారావు, సన్యాసయ్య, తానేశ్వర్‌, సురేష్‌, చత్రునాయక్‌, సూర్యనారాయణ, రఘువరణ్‌, మునిసిపల్‌ కమిషనర్లు నరేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, గుండె బాబు, గణేష్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-12T05:39:36+05:30 IST