Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): జిల్లా పరిధి మేడిపల్లి మండలంలోని 11 మంది ఎస్సీ రైతులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం మేడిపల్లిలో భూమి కోల్పోతున్న 11 మంది రైతులను పిలిపించుకుని చర్చలు జరిపారు. కాగా, తమ భూమి ఇతర అవసరాలకు ప్రభుత్వం తీసుకుంటే జీవనోపాధి లేకుండా పోతుందని మేడిపల్లికి చెందిన రైతులు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారితో కలెక్టర్‌ మాట్లాడుతూ.. తగిన పరిహారంతోపాటు పునరావాసం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, డీఆర్డీవో లింగ్యానాయక్‌, ఆర్డీవో రవి, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ భాస్కర్‌లు పాల్గొన్నారు. కాగా, శీతాకాలం విడిది కోసం త్వరలో తెలంగాణకు వస్తున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విమానాశ్రయంలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని, రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. అలాగే కొవిడ్‌ నేపథ్యంలో శానిటైజేషన్‌, ఆరోగ్య వైద్యసిబ్బంది, అటవీశాఖ, మునిసిపాలిటీ అధికారులు అన్ని రకాలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్‌శాంసన్‌లతోపాటు ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, రబీలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ రైతులను కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రేఖాతోపాటు అధికారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Advertisement
Advertisement