అన్నింటా నెంబర్‌వన్‌గా మేడ్చల్‌

ABN , First Publish Date - 2021-10-28T04:21:19+05:30 IST

అన్నింటా నెంబర్‌వన్‌గా మేడ్చల్‌

అన్నింటా నెంబర్‌వన్‌గా మేడ్చల్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి, హాజరైన నాయకులు

  • టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

(ఆంధ్రజ్యోతి,మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజక వర్గం అన్నింట్లో నెంబర్‌వన్‌గా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తా సమీపంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి అఽధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ భారీగా పెరిగిందన్నారు.  తెలంగాణలో కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా చేపట్టడం లేదన్నారు. టీఆర్‌ఎ్‌సపార్టీపై ప్రజలు, కార్యకర్తల్లో నమ్మకం పెరిగిందన్నారు. కానీ పార్టీలో లోడు ఎక్కువైందని, ఎవ్వరూ తొందర పడకుడదన్నారు.  440 మంది ప్రజాప్రతినిధులు ఉన్న ఏకైన నియోజకవర్గం ఒక్క మేడ్చల్‌ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. నాటి చెన్నారెడ్డి నుంచి నేటి కేసీఆర్‌ వరకు అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. నవంబరు 15న వరంగల్‌లో విజయగర్జన సభకు తరలేందుకు 271 బస్సులు కేటాయించారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రరెడ్డి అన్నారు. కాగా సమావేశంలో కార్యకర్తలు మంత్రికి మల్లారెడ్డికి కరవాలం బహూకరించారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి పార్లమెంటరీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షుడు నందారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జంహగీర్‌, డీసీఎంస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైౖర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు నాయకులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి  మంత్రి కొందరినే ఆహ్వానించారని, వారికే పాసులు ఇచ్చారని తమకు ఇవ్వలేదని పీర్జాదిగూడ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దుర్గాదయాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేదిక దిగి వెళ్లిపోగా కొందరు నాయకులు తీసుకొచ్చి వేదికపై కూర్చోబెట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ 6,500పాస్‌లకు కేవలం 200 పాస్‌లు మాత్రమే ఇచ్చారని, దీంతో అందరికీ పాసులు ఇవ్వలేక పోయానని చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-10-28T04:21:19+05:30 IST