Advertisement
Advertisement
Abn logo
Advertisement

మణిపాల్‌లో జగన్‌కు వైద్య పరీక్షలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుప్రతికి వచ్చారు. ఉదయం 9.40 గంటలకు  వచ్చిన ఆయనను మణిపాల్‌ యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ కె సుధాకర్‌ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. జగన్‌ కుడికాలుకు వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఎమ్మార్‌ఐ స్కాన్‌ చేశారు. అనంతరం జగన్‌, జనరల్‌ చెకప్‌ చేయించుకున్నారు. ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకున్న అనంతరం 11.30 గంటల సమయంలో క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్లారు. సీఎం జగన్‌ వెంట టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి  వున్నారు. 

Advertisement
Advertisement