Abn logo
Aug 2 2021 @ 03:15AM

వైద్య.. నారాయణుడు!

వైద్యుడిని భగవంతుడితో ఎందుకు పోలుస్తారో.. ఇటువంటి వారిని చూస్తే తెలుస్తుంది. ఒక చేతికి సెలైన్‌ ఎక్కుతుండగా.. మరో చెత్తో రోగికి మందులు రాస్తున్న ఈయన పేరు సుందర ప్రసాద్‌. తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం రేఖపల్లి పీహెచ్‌సీలో వైద్యుడు. సెలవులు కూడా తీసుకోకుండా.. కొండలు గుట్టలు ఎక్కి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తుంటారు. శనివారం ఆయన గోదావరి నదిపై ప్రయాణించి.. రహదారి సౌకర్యంలేని గ్రామాలకు నడిచి వెళ్లి కొండరెడ్లకు వైద్యం చేశారు. ఈ క్రమంలో జ్వరం బారినపడ్డారు. జ్వరంతో ఉన్నా ఆదివారం పీహెచ్‌సీకి వచ్చిన రోగులను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక చేతికి సెలైన్‌ పె ట్టుకునే వైద్యసేవలు అందించారు. సీరియస్‌ కేసులు వచ్చినప్పుడు అంబులెన్స్‌ అందుబాటులో లేకపోతే తన సొంత కారులోనే రోగులను భద్రాచలం ఆస్పత్రికి పంపుతుంటారు. - వరరామచంద్రపురం