సాదాసీదాగా జడ్పీస్థాయీ సంఘాల సమావేశం

ABN , First Publish Date - 2020-06-28T06:35:52+05:30 IST

ఖమ్మం జడ్పీస్థాయి సంఘాల సమావేశాలు శనివారం సాదాసీదాగా జరిగాయి. కరోనా నేపథ్యంలో సభ్యులు సకాలంలో హాజరుకాకపోవడంతో

సాదాసీదాగా జడ్పీస్థాయీ సంఘాల సమావేశం

2, 3, 6 కమిటీలు నిరవధిక వాయిదా

హాజరుకాని ఎమ్మెల్యేలు.. నామమాత్రంగా చర్చ


ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 27: ఖమ్మం జడ్పీస్థాయి సంఘాల సమావేశాలు శనివారం సాదాసీదాగా జరిగాయి. కరోనా నేపథ్యంలో సభ్యులు సకాలంలో హాజరుకాకపోవడంతో 2వ కమిటీ గ్రామీణాభివృద్ధి, 3వ కమిటీ వ్యవసాయం, 6వ కమిటీ సాంఘీక సంక్షేమం కమిటీలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్‌ ప్రకటించారు. ఇక హాజరైన ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేధికలను చదివారే తప్ప వాటిపై చర్చ అంతంత మాత్ర ంగానే సాగింది. విద్యవైద్యం సమావేశంపై జడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నందున ప్రైవేటు ఆసుపతుఉల్రకు అనుమతులిచ్చారా ? అని జడ్పీ  డీఎంహెచ్‌వోను ప్రశ్నించగా ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేని ప్రకటించారు.


వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రకటించారు. ప్రైవేట పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నపై డీఈవో మదన్‌గోపాల్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదన్నారు. ఇంటర్మీడియట్‌ కళాశాలలపై జడ్పీ చైర్మన్‌ అడిగిన ప్రశ్నకు డీఐవో వివరణ ఇవ్వాల్సి ఉండగా ఆయన సమావేశానికి హాజరుకాలేదు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, డిప్యూటీ సీఈవో వింజం వెంకటఅప్పారావు, డీఎంహెచ్‌వో మాలతి, వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి కె శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-28T06:35:52+05:30 IST