Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెండిస్‌ ‘సిక్సర్‌’

విండీస్‌ 253 ఆలౌట్‌ 

గాలె: స్పిన్నర్లు తిప్పేస్తుండడంతో శ్రీలంక, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. రమేష్‌ మెండిస్‌ (6/70) ఆరు వికెట్లతో విజృంభించడంతో.. మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 69/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించినవిండీస్‌ 253 పరుగులకు ఆలౌటైంది. లంక తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 204 పరుగులకు 49 రన్స్‌ ఆధిక్యం మాత్రమే నమోదు చేసింది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ (72), బ్లాక్‌వుడ్‌ (44) టాప్‌ స్కోరర్లు. లసిత్‌ ఎంబుల్డెనియా, జయవిక్రమ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లంక బుధవారం ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46/2తో ఆడుతోంది. నిస్సాంక (21), అసలంక (4) క్రీజులో ఉన్నారు. 

Advertisement
Advertisement