మూడు లక్ష్యాలతో సామర్ధ్యం పెంచుకుంటున్న మెట్రోపొలిస్ హెల్త్‌కేర్...

ABN , First Publish Date - 2021-11-26T22:01:13+05:30 IST

మూడు లక్ష్యాల సాధనలో భాగంగా... అతి పెద్ద డయాగ్నొస్టిక్ చైన్లలో ఒకటైన మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ తన సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది.

మూడు లక్ష్యాలతో సామర్ధ్యం పెంచుకుంటున్న మెట్రోపొలిస్ హెల్త్‌కేర్...

హైదరాబాద్ : మూడు లక్ష్యాల సాధనలో భాగంగా... అతి పెద్ద డయాగ్నొస్టిక్ చైన్లలో ఒకటైన  మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ తన సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది.  ఫోకస్ సిటీల్లో లోతుగా పాతుకుపోవడం, స్పెషలైజ్‌డ్‌ టెస్ట్స్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడం, డిజిటల్‌లోకి మారడం... ఈ లక్ష్యాలు. ఈ లక్ష్యాల సాధనలో భాగంగానే సామర్ధ్యాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతమున్న నెట్‌వర్క్‌లో పరీక్షల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, వచ్చే మూడేళ్లలో 90 కొత్త టెస్టింగ్ లేబొరేటరీలు, 1800 కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాగా... 90 కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి కంపెనీ పెట్టే పెట్టుబడి రూ. 50 కోట్లు. ఇక... కలెక్షన్‌ సెంటర్లు మాత్రం ఫ్రాంచైజీల ద్వారానే రానున్నందున, వాటి కోసం పెట్టే పెట్టుబడి బాగా తక్కువగానే ఉంటుంది.


ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి 132 ల్యాబ్‌లు, 3,006 కలెక్షన్‌ సెంటర్లు మెట్రోపొలిస్ ఖాతాలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఏడు ల్యాబ్‌లు, 451 సర్వీస్‌ సెంటర్లను మెట్రోపొలిస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా... కనీసం 25 లేబొరేటరీలు, 700-750 కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటు కంపెనీ లక్ష్యం. ప్రధాన నగరాలైన ముంబై, పూనా, చెన్నై, బెంగళూరు, సూరత్‌లలో అధికంగా విస్తరణ జరుగుతోంది. కాగా... ప్రధాన నగరాల్లో కొత్త ల్యాబ్ బ్రేక్‌-ఈవెన్‌కు ఒకటిన్నర సంవత్సరాలు, ఇతర నగరాల్లో రెండున్నర నుంచి మూడేళ్లు పడుతుంది. కలెక్షన్‌ సెంటర్ల విషయంలో ఇది మూడు సంవత్సరాలు. కంపెనీ మొత్తం ఆదాయంలో స్పెషలైజ్‌డ్‌ టెస్ట్స్‌ నుంచి 43 % కాంట్రిబ్యూషన్‌ అందుతోంది. ఇది 50 %కు చేరుతుందని కంపెనీ విశ్వాసంతో ఉంది. ప్రొడక్టివిటీ, కన్యూమర్‌తో సంబంధాలు, స్పెషలైజ్‌డ్‌ టెస్టింగ్‌లో రీసెర్చ్‌ను పెంచేందుకు డిజిటలైజేషన్‌ కోసం ఏటా రూ. 15-20 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక... ఈ రోజు మధ్యాహ్నం 11.52 గంటల సమయానికి, 2.56 % వృద్ధితో, రూ. 3,023 వద్ద షేర్లు ట్రేడవుతున్నాయి. 

Updated Date - 2021-11-26T22:01:13+05:30 IST