పర్సనల్‌ కాల్స్‌కూ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌

ABN , First Publish Date - 2021-05-22T09:11:30+05:30 IST

ఆఫీస్‌ వర్క్‌ అంటే అందరూ కామన్‌గా ‘మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌’నే ఉపయోగిస్తున్నారు. అదే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ చాట్స్‌, కాల్స్‌ అంటే మాత్రం ‘వాట్సాప్‌’, ‘జూమ్‌’ వాడుతున్నారు. అందుకే యూజర్లు అందరూ ఫ్యామిలీ కాల్స్‌కు కూడా ‘టీమ్స్‌’ను ఉపయోగించేలా ప్లాన్‌ చేస్తోంది మైక్రోసాఫ్ట్‌. టీమ్స్‌ను ఉపయోగించని

పర్సనల్‌ కాల్స్‌కూ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌

ఆఫీస్‌ వర్క్‌ అంటే అందరూ కామన్‌గా ‘మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌’నే  ఉపయోగిస్తున్నారు. అదే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ చాట్స్‌, కాల్స్‌ అంటే మాత్రం ‘వాట్సాప్‌’, ‘జూమ్‌’ వాడుతున్నారు. అందుకే యూజర్లు అందరూ ఫ్యామిలీ కాల్స్‌కు కూడా ‘టీమ్స్‌’ను ఉపయోగించేలా ప్లాన్‌ చేస్తోంది మైక్రోసాఫ్ట్‌. టీమ్స్‌ను ఉపయోగించని వినియోగదారులకూ కాల్‌ చేసే సదుపాయం ఉంది. అన్ని డివైజెస్‌లపై పనిచేస్తుంది. ఒక్క వీడియో కాల్‌పై మూడు వందల మందిని ఆహ్వానించవచ్చు. 24 గంటలసేపు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇందులో ఫీచర్ల విషయానికి వస్తే...


టుగెదర్‌ మోడ్‌: ఛాట్‌ చేసే సభ్యులు అందర్నీ సింగిల్‌ స్ర్కీన్‌పైకి తీసుకురావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తిగతమిత్రుల వరకు దీన్ని లైవ్‌ చాట్‌ కోసం ఉపయోగించుకోవచ్చు.


లైవ్‌ ఎమోజీలు: టీమ్‌ మీటింగ్‌లు జరుగుతున్నప్పుడు లైవ్‌ ఎమోజీలు, జిఐఎఫ్‌ ఉపయోగించవచ్చు. మధ్యలో చర్చ మిస్‌ అయినప్పటికీ కొనసాగించే అవకాశం ఉంటుంది. 


షేర్డ్‌ టు-డు లిస్ట్స్‌: దీని ద్వారా గ్రూపులోని సభ్యులకు పనులు అప్పగించవచ్చు. ఇందులో పాల్గొన్న సభ్యులు అందరికీ యావత్తు టాస్క్‌లను చూడగలిగే, ఎడిట్‌ చేసే సౌలభ్యం ఉంటుంది. దీంతోనే చిల్లర సామాను కొనుగోలు, బట్టలు ఉతుకించుకోవడం వంటి పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు. 


వీకెండ్‌ కార్యకలాపాలపై పోల్‌: వారాంతాలు, సెలవు రోజుల్లో చేపట్టబోయే పనులపై పోల్స్‌ నిర్వహించుకోవచ్చు. తదనుగుణంగా ముందుగానే ఆ రోజుల్లో ఏమి చేసుకోవచ్చో నిర్ణయించుకోవచ్చు.


డాష్‌ బోర్డ్‌ వ్యూ: పర్సనల్‌ చాట్స్‌, ఫొటోలు, వీడియోలు, షేర్‌ చేసుకున్న టాస్కులు సహా అన్నీ చూడవచ్చు. 


సెపరేట్‌: మై ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఇందులోనే పర్సనల్‌ అకౌంట్స్‌తో కేవలం ఇద్దరు  మాత్రమే చాటింగ్‌ తదితర సదుపాయాలనూ పొందవచ్చు.

Updated Date - 2021-05-22T09:11:30+05:30 IST