వరద నీటితో నిండుకుంటున్న రాజరాజేశ్వర జలాశయం

ABN , First Publish Date - 2020-09-19T14:04:05+05:30 IST

భారీగా వస్తున్న వరద నీటితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నిండుకుంటోంది.

వరద నీటితో నిండుకుంటున్న రాజరాజేశ్వర జలాశయం

రాజన్నసిరిసిల్ల: భారీగా వస్తున్న వరద నీటితో శ్రీ రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నిండుకుంటోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీ కాగా... ప్రస్తుతం 26.17 టీఎంసీగా నమోదు అయ్యింది. అలాగే ఇన్ ఫ్లో 9333 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7030 క్యూసెక్కులుగా ఉంది.  మిడ్ మానేర్ ప్రాజెక్టు నీటి నిల్వ లైవ్ కెపాసిటీని దాటింది. దాటిన ప్రాజెక్టు నుండి 6 రేడియల్ గేట్ల ద్వారా ఎల్ఎండీకి 7030 క్యూలెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌తో సంకేపల్లి, అరెపల్లి గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-09-19T14:04:05+05:30 IST