మైలాన్ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర రూ.4,800
ABN , First Publish Date - 2020-07-07T06:47:37+05:30 IST
కొవిడ్-19 చికిత్స కోసం ‘డెస్‌రెమ్’ పేరుతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ (100 ఎంజీ/వయల్)ను మైలాన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెలలోనే డెస్‌రెమ్ అందుబాటులోకి వస్తుందని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్-19 చికిత్స కోసం ‘డెస్‌రెమ్’ పేరుతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ (100 ఎంజీ/వయల్)ను మైలాన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెలలోనే డెస్‌రెమ్ అందుబాటులోకి వస్తుందని, దీని ధర రూ.4,800 ఉంటుందని మైలాన్ ప్రెసిడెంట్ రాకేశ్ బామ్‌జై తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రాండెడ్ వెర్షన్‌ను విక్రయిస్తున్న ధర కంటే 80 శాతం తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది.