Abn logo
May 5 2021 @ 00:21AM

ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్టు

కుర్నపల్లి అడవుల్లో పట్టుకున్న చర్ల పోలీసులు

వివరాలు వెళ్లడించిన భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినిత్‌

చర్ల, మే 4: చర్ల మండలం కుర్నపల్లి అటవీ ప్రాతంలో మంగళవారం ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినిత్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆయన వెళ్లడించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కుర్నపల్లి అటవీ ప్రాతంలో చర్ల సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ 141-ఏ బెటాలియన్‌ పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో అనుమానాస్పదంగా ఐదు గురు వ్యక్తులు పట్టుబడ్డారు. అనంతరం వారిని విచారించగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొవ్వాసి అడమయ్య, మడకం దుర్గారావు, వెకో సూల, ఊకె సారయ్య, మడివి గంగయ్యగా తేలింది. వీరు కాలంగా మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దులోని చర్ల, కిష్టారంపాడు పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ పోలీసుల కదలికలను మావోయిస్టులు చేరవేస్తున్నారని ఏఎస్పీ తెలిపారు. నిమ్మలగూడెం, పుట్టపాడు, జెట్టిపాడు, డోకుపాడు, బత్తినపల్లి, బట్టిగూడెం, పెన్నాపురంలోని ఇతర మావోయిస్టులతో కలిసి పలు విధ్వంసకర ఘనటల్లో పాల్గొన్నారని తెలిపారు. కుర్నపల్లి అడవుల్లో కూంబింగ్‌ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు. సమావేశంలో చర్ల సీఐ అశోక్‌, ఎస్సై వెంకటప్పయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement