పతక విజేతలకు కోట్లాభిషేకం..!

ABN , First Publish Date - 2021-07-21T08:36:57+05:30 IST

అగ్రదేశాల కన్నా మిన్నగా రాష్ట్రాల భారీ నజరానాలు

పతక విజేతలకు కోట్లాభిషేకం..!

అగ్రదేశాల కన్నా మిన్నగా రాష్ట్రాల భారీ నజరానాలు 

స్వర్ణ విజేతలకు రాష్ట్రాల నజరానా

రూ. 6 కోట్లు: యూపీ, హరియాణా, ఒడిశా

రూ. 5 కోట్లు కర్ణాటక, గుజరాత్‌

3 కోట్లు: ఢిల్లీ, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు

రూ. 2.25 కోట్లు: పంజాబ్‌

 రూ. 2 కోట్లు:తెలంగాణ హిమాచల్‌, జార్ఖండ్‌ 

రూ. 1.5 కోట్లు ఉత్తరాఖండ్‌

రూ. 1.2 కోట్లు మణిపూర్‌

రూ. కోటి మహారాష్ట్ర, కేరళ, గోవా

రూ. 75 లక్షలు ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ

రూ. 50 లక్షలు జమ్మూకశ్మీర్‌ 

రూ. 25 లక్షలు పశ్చిమ బెంగాల్‌


పసిడి విజేతలకు ఇతర దేశాల ప్రైజ్‌మనీ..

కెనడా : రూ. 15 లక్షలు

జర్మనీ : రూ 18.73 లక్షలు

అమెరికా : రూ. 28 లక్షలు

రష్యా : రూ. 46 లక్షలు

ఇటలీ : రూ. 1.25 కోట్లు

కజకిస్థాన్‌ : రూ. 1.87 కోట్లు


ఆఖరి నిమిషంలోనైనా రద్దు కావచ్చు 

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. కాగా, టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోషిరో మూటో తాజాగా మరో బాంబు పేల్చాడు. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని చెప్పాడు. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారితే.. చివరి నిమిషంలోనైనా ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమన్నాడు. ‘ఏం జరుగుతుందో ముందుగా ఊహించలేం. కానీ, కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనే దానిపైనా సమాలోచనలు చేస్తున్నామ’ని మోటో తెలిపారు. 


న్యూఢిల్లీ: ఒలింపిక్‌ పతకం పట్టు.. కోట్లు కొల్లగొట్టు అన్నట్టుగా.. భారత అథ్లెట్లపై కాసుల వర్షం కురవనుంది. ప్రపంచంలోని ధనిక దేశాలు కూడా ప్రకటించని భారీ నజరానాలను.. మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి అవాక్కయ్యేలా చేశాయి. మెగా ఈవెంట్‌లో మెడల్‌ సాధించిన అథ్లెట్లకు రూ. 25 లక్షల నుంచి రూ. 6 కోట్ల వరకు ముట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం స్వర్ణం గెలిచిన ప్లేయర్‌కు రూ. 2 కోట్లు ఇవ్వనుండగా.. ఆంధ్రప్రదేశ్‌ రూ. 75 లక్షల ప్రైజ్‌మనీతో సత్కరించనుంది. పసిడి పట్టిన ప్లేయర్‌కు హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు అత్యధికంగా ఆరు కోట్ల రూపాయలు ప్రకటించాయి. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు.. స్వర్ణానికి రూ. 75 లక్షలు, రజతానికి రూ. 50 లక్షలు, కాంస్యానికి రూ. 25 లక్షలు అదనం. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండే  పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం సాధించగా.. రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌ కాంస్యం నెగ్గింది. మరి ఈసారి ఎన్ని పతకాలు దక్కుతాయో చూడాలి..!


నిద్రలేని రాత్రులు గడిపాం: ఐవోసీ చీఫ్‌ 

ఒలింపిక్స్‌ను వాయిదా వేయడంతో.. ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ సం ఘం (ఐవోసీ) చీఫ్‌ థామస్‌ బాచ్‌  చెప్పాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో నెలకొన్న అనిశ్చితి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని తెలిపాడు. ఆరంభ సమయం దగ్గరపడినా ఆందోళన మాత్రం తగ్గలేదన్నాడు.


ముగ్గురితో కాదు.. ఆరుగురితో ప్రతిజ్ఞ..

విశ్వక్రీడల ఆరంభోత్సవంలో ప్రతిజ్ఞ చేయించే అథ్లెట్ల సంఖ్యను మూడు  నుంచి ఆరుకు పెంచారు. లింగ సమానత్వాన్ని కూడా పాటించనున్నారు. మెగా ఈవెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల తరఫున ఇద్దరు ఆతిథ్య అథ్లెట్లు ప్రతిజ్ఞ చేయనున్నారు.

Updated Date - 2021-07-21T08:36:57+05:30 IST