సాంస్కృతిక వికాసంలోమహిళల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-10-13T05:29:54+05:30 IST

సాంస్కృతిక వికాసంలోమహిళల పాత్ర కీలకం

సాంస్కృతిక వికాసంలోమహిళల పాత్ర కీలకం
తాడ్వాయిలో విద్యార్థినికి బతుకమ్మ డ్రెస్‌ను అందజేస్తున్న మంత్రి దయాకర్‌రావు

 వారి కృషిని తెలిపే పండుగ బతుకమ్మ

 పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు 

తాడ్వాయి, అక్టోబరు 12: సాంస్కృతిక వికాసంలో మహిళ పాత్ర కీలకమని రాష్ట్ర పంచాయతీరాజ్‌  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత సమకూర్చిన బతుకమ్మ డ్రెస్సులను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాకాశాలలోని విద్యార్థినులకు మంత్రి మంగళవారం పంపిణీ చేశారు. శ్రమ, సంపద సృష్టితోపాటు సాంస్కృతిక వికాసంలో మహిళల కృషిని తెలిపే పండుగ బతుకమ్మ అన్నారు. తాడ్వాయి అరణ్యం జీవవైవిధ్య కేంద్రమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆసనాల శ్రీనివాస్‌ రాసిన తెలంగాణ బతుకుపండుగ వ్యాసాన్ని ఆవిష్కరించడంతోపాటు రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపాల్‌గా పురస్కారం పొందడం పట్ల ఆయన్న మంత్రి సన్మానించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, ఆత్మ చైర్మన్‌ రమణయ్య, నాయకులు సలేందర్‌, అధ్యాపకులు రాములునాయక్‌, సంధ్య, కిషన్‌, మూర్తి, రాజు, శ్వేత, రాజ్‌కుమార్‌, శ్రీలత, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-13T05:29:54+05:30 IST