కొవిడ్‌ బాధితులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-05-16T06:28:09+05:30 IST

కొవిడ్‌ బాధితులను ఆదుకుంటాం

కొవిడ్‌ బాధితులను ఆదుకుంటాం
ఆస్పత్రుల్లో సౌకర్యాలు పరిశీలిస్తున్న మంత్రి దయాకర్‌ రావు

సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి కృషి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తొర్రూరు,మే 15: కొవిడ్‌ సోకిన బాధితులను అన్ని విదాలుగా ఆదుకుంటా మని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర పం చాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 30 పడకల కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఓపీ ఐసోలేషన్‌ బెడ్స్‌, ఆక్సీజన్‌ అందించే విధానం తదితర అంశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కొవిడ్‌ రోగులు అధైర్యపడవద్దని చికి త్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ల కుండా స్థానికంగా వైద్య సేవలు అందిం చేందుకు అన్ని చర్యలు చేపడుతు న్నా మన్నారు. ఆక్సీజన్‌ కొరత రాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతుందని కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బంది, డాక్టర్‌లు 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లోనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని, కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవ హరించాలని ఆదేశించారు. అనంతరం దాతలు అందించిన మాస్కులను పంపిణీ చేశారు. 

ఐసోలేషన్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

 కొవిడ్‌ బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ కేంద్రా లను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వీపీగౌతమ్‌ అన్నారు. శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం తో పాటు గూడూరు, తొర్రూరులో 30 పడకలతో ప్రారంభించామని, త్వరలో గార్ల, మరిపెడ, డోర్నకల్‌లలో 20 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామ ని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, జిల్లా వైద్యాధికారి హరీష్‌ రాజ్‌, నోడల్‌ అధికారి రాజేష్‌, ఆర్డీవో రమేష్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, డాక్టర్లు మురళీదర్‌, దిలీప్‌, మీరజ్‌, రేణుక, విజయ్‌ కుమార్‌, వేదకిరణ్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-16T06:28:09+05:30 IST