గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు బి ఫారాల అందజేత
ABN , First Publish Date - 2021-04-21T19:38:37+05:30 IST
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం మంత్రి దయాకర రావు కార్యాలయంలో బి.ఫారాలను అందజేశారు. 18మందికి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ బి.ఫామ్ లు అందించారు. టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ ఉందని, అయితే సామాజిక న్యాయం, ఉద్యమకారులు సీనియర్లను దృష్టిలో పెట్టుకొని బి.ఫామ్ లు అందిస్తున్నామని, టిక్కెట్ రానివారికి సముచితమైన స్థానం ఇస్తామని సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. టికెట్ వచ్చిన అభ్యర్థులు, రాని వారిని కలుపుకొని వెళ్లాలని, పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రులు కోరారు.
టికెట్లు రాని నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ సమన్వయ కమిటీ ముందు చెప్పాలని, బహిరంగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగర వేస్తామని, 66 మందిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కి కానుకగా ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి మంచి మద్దతిచ్చి గెలిపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మీ ఆశీర్వాదం ఉండాలlని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా టికెట్స్ ఇస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల మెరుగైన అభ్యర్థులు ఉన్నా సామాజిక న్యాయం కోసం టికెట్స్ ఇస్తున్నాం.
ఉద్యమకారులు, సీనియర్లను కూడా కలుపుకొని అందరికీ తగిన స్థానం ఉండే విధంగా టికెట్ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో రాష్టానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగురవేస్తాం.అన్ని సీట్లు గెలిచి సీఎం కేసిఆర్ కి కానుకగా ఇస్తాం.గత ఏడేళ్లలో వరంగల్ లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాకముందు 70 ఏళ్లలో జరగలేదు.ఎవరెన్ని మాట్లాడినా ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నది వాస్తవం అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టాలని, టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్
బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆయాడివిజన్ల లో సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఉద్యమంలో చాలా మంది పని చేశారు. డీ లిమిటేషన్ కావడం వల్ల రిజర్వేషన్ మారి చాలా ఇబ్బంది ఏర్పడిందన్నారు.ఆ రెండు ప్రతిపక్ష పార్టీల నాయకులు వరంగల్ నగరం పట్ల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.టి.ఆర్.ఎస్ పార్టీ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. వరంగల్ నగరానికి రింగ్ రోడ్డు వచ్చింది...మంచి నీటి పథకాలు, డ్రైనేజీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. ముంబై కు పూణే మాదిరిగా వరంగల్ అభివృద్ధి కానుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, పార్టీ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, తదితరులు పాల్గొన్నారు.