ఘనంగా ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో రావణ వధ

ABN , First Publish Date - 2021-10-16T21:03:46+05:30 IST

లోక కంఠకుడైన మహిషాసురుడితో జగన్మాత తొమ్మిది రాత్రులుయుధ్దం చేసి అతన్ని చంపి జయాన్ని పొందిన సందర్బంగా విజయ దశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఘనంగా ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో రావణ వధ

వరంగల్: లోక కంఠకుడైన మహిషాసురుడితో జగన్మాత తొమ్మిది రాత్రులుయుధ్దం చేసి అతన్ని చంపి జయాన్ని పొందిన సందర్బంగా విజయ దశమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండగ గా కూడా ప్రసిద్ధి పొందిందన్నారు. విజయ దశమి సందర్భంగా ఉర్సుగుట్ట మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన రావణ దహనం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక,పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు గా ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేస్తుంటారు.


జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి విజయ సాధించిన రోజుకూడా కావడంతో ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజున రావణదహనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇలాంటి పండగలు కూడా తెలంగాణ సాధనకు స్ఫూర్తి దాయకం అని ఎన్నో ఆటంకాలను అధిగమించి కేసిఆర్ తెలంగాణ సాధించారని మంత్రి పేర్కొన్నారు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా కాపాడుతూ, బంగారు తెలంగాణ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం విడనాడకుండా కరోనా కష్ట కాలం లో సైతం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ను దేశంలో అగ్రగామిగా నిలిపారని అన్నారు. ఎన్నిక ఏదైనా, గెలుపు మనదే, ప్రజల సంపూర్ణ మద్దతు కూడా టిఆర్ఎస్ వుందన్నారు.బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే సరదా పండుగ దసరాను ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని రక్షించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-10-16T21:03:46+05:30 IST