Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని రైతు నష్టపోకుండా ప్రతిగింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో ప్యాక్స్(పీఏసీకేఎస్),తిర్మలాయపల్లి గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందని అయిన అన్నారు. 


అయినప్పటికీ రైతుకు నష్టం కలగకుండా మద్దతు ధర కల్పంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్యం కోనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆగం చేసి రాజకీయ లబ్ధిపొందాలని కుట్రలు చేస్తుందన్నారు.సిఎం కేసీఆర్ రైతులు ఆగం కావద్దని, ప్రత్యామ్నాయ లాభసాటి పంటలను సాగుచేయాలని సూచిస్తున్నారని అన్నారు. అందువల్ల రైతులు వచ్చే యాసంగిలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు అయిన పల్లి, పామ్ ఆయిల్, ఇతర లాభదాయక పంటలు సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని, రైతు శ్రేయస్సును కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement