యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-15T20:07:19+05:30 IST

రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న: మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రిజిల్లా: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మాఇలవేల్పు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ  తిరుగులేని విజయాన్ని  సాధించింది. ఈ సందర్భంగా స్వామివారి కి  పూజలు నిర్వహించినట్టు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. 


గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చుస్తే యాదాద్రి కేనా వచ్చింది అన్నంత  అభివృద్ధి జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ ఆలయ ఉద్ఘాటన చేయనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రధానులు, ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరుకానున్నారని చెప్పారు. మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. సీఎం కేసిఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు.ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-12-15T20:07:19+05:30 IST