Abn logo
Oct 22 2021 @ 19:30PM

అర్వింద్‌ కారు గుర్తుకు ప్రచారం చేస్తున్నట్టా?: మంత్రి హరీష్‌రావు

హుజురాబాద్: తనపై బీజేపీ ఎంపీ అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. "నేను సిలిండర్‌తో ప్రచారం చేస్తే..ఇంకో అభ్యర్థికి మద్దతిచ్చాను అంటున్నారు. అర్వింద్‌ రోజూ కారులో తిరుగుతున్నారు..మరి కారు గుర్తుకు ప్రచారం చేస్తున్నట్టా?" అని అర్వింద్‌‌ను ఆయన ప్రశ్నించారు. తమకు అర్వింద్‌ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని హరీష్‌రావు హితవు పలికారు. పసుపు బోర్డు విషయంలోనే అర్వింద్‌ పనితీరు ఏమిటో తెలిసి పోయిందని హరీష్‌రావు ఎద్దేవా చేసారు. 

 


 రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హరీష్‌రావు ఓ ఫకీరు అని అరవింద్ అన్నారు. కొంగ లెక్క ఉన్న హరీష్‌రావు కొంగ కథలు చెప్తున్నాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓడిపోయే దగ్గరకు కేటీఆర్, కేసీఆర్ రారని, హరీష్ రావు అనే ఓ ఫకీరును పంపిస్తారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఫకీరు హరీష్ రావు ఓ  గ్యాస్ సిలెండర్ బుడ్డిని పట్టుకుని ప్రచారం చేస్తున్నాడన్నారు. ఆ సిలెండర్ గుర్తు ఇంకో అభ్యర్థిదని ఆయన వివరించారు.


రాష్ట్రంలో అమలు చెయ్యని పథకాలను మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టినావని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. విధివిధానాలు లేకపోతే వాటిని పీకడానికి పెట్టినవా అని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ బిడ్డ కవిత బంగారు చైన్‌లు ఎత్తుకుపోతుందని అరవింద్ ఆరోపించారు. దుకాణాలకు పోవడం, చైన్లు తీసుకోవడమే ఆమె పని అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...