తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్: హరీష్ రావు

ABN , First Publish Date - 2021-12-14T21:12:28+05:30 IST

రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి

తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్: హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి  హరీష్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరు సీట్లు టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ను గెలిపించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయన్నారు. 



Updated Date - 2021-12-14T21:12:28+05:30 IST