నిర్మల్ లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

ABN , First Publish Date - 2021-01-16T19:43:30+05:30 IST

క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు నిర్మల్ జిల్లాలో అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టారు.

నిర్మల్ లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను  ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్: క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు నిర్మల్ జిల్లాలో అటవీ, పర్యావరణ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం  శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వాక్సిన్  పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూశారని, కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు.


రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.కోవిడ్ టీకా వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత  కూడా సరైన  జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలన్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించాలని కోరారు.

Updated Date - 2021-01-16T19:43:30+05:30 IST