యువతకు వ్యాక్సినేషన్ తప్పనిసరి: మంత్రి జగదీశ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-03T22:49:39+05:30 IST

15 నుండి 17 సంవత్సరాల యువతీ యువకులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు

యువతకు వ్యాక్సినేషన్ తప్పనిసరి: మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: 15 నుండి 17 సంవత్సరాల యువతీ యువకులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తండా నుండి బస్తీ వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 15 నుండి 17 సంవత్సరాల యువతీ యువకులకు ఇచ్చే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మూడవ వేవ్ ప్రబలుతున్న నేపధ్యంలో యావత్ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 


అదే సమయంలో కరోనా అంటే  భయపడొద్దని స్వీయ నియంత్రణతో పాటు వైద్య ఆరోగ్య శాఖా చెపుతున్న నిబంధనలు పాటించాలన్నారు. పెద్దలకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ సూర్యపేట జిల్లాలో మొదటి డోస్ 96%పూర్తి కాగా రెండో డోస్ ఇప్పటి వరకు 50%శాతానికి పై బడి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,డి యం హెచ్ ఓ వెంకట రమణ,డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T22:49:39+05:30 IST