యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి : జగదీశ్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-04-25T00:32:43+05:30 IST
ఈ ఏడాది యాసంగిలో ఊహించని విధంగా వరి దిగుబడి పెరిగిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం జలాల రాకతోనే
సూర్యాపేట: ఈ ఏడాది యాసంగిలో ఊహించని విధంగా వరి దిగుబడి పెరిగిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం జలాల రాకతోనే జిల్లాలో ఇంతటి దిగుబడి సాధ్యమైందని ఆయన అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తికి మంచి ధరను పొందడానికి నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని కోరారు.
గడిచిన నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ యాసంగిలో ముందెన్నడూ లేనంతగా వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదట లబ్ధి పొందేది సూర్యాపేట జిల్లా అన్నది రుజువైందనారు. దీనికి జిల్లాలో పెరిగిన వరి ధాన్యమే నిదర్శనమని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కోసం మరో 23 రైస్ మిల్లులకు అనుమతులను అప్పటికప్పుడు కమిషనర్‌తో మాట్లాడి మంజూరు చేయించారు.